మహబూబ్నగర్ జిల్లాలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, అతని సోదరుడు శ్రీకాంత్ గౌడ్ అవినీతి కార్యకలాపాలపై హైకోర్టులో పిటిషన్ వేసినందుకు... తనపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని రాఘవేంద్ర రాజు అనే వ్యక్తి ఆరోపించారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ విషయంపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి అవినీతి కార్యకలాపాలు, అతని సోదరుడి భూకబ్జాలపై ఎవరు ప్రశ్నించినా.. వారిపై అక్రమ కేసులు పెడుతూ భయాందోళనకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.