మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదంటూ వైస్ ఎంపీపీ సుమతి నిరసన వ్యక్తం చేశారు. మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరుగుతుండగా కార్యాలయం ముందు బైఠాయించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కార్యాలయం ఎదుటే ఉన్నారు.
ప్రోటోకాల్ పాటించడం లేదంటూ వైస్ ఎంపీపీ నిరసన - మహబూబ్నగర్ జిల్లా తాజా వార్తలు
అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదంటూ మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంటలో వైస్ ఎంపీపీ నిరసన తెలిపారు. మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరుగుతుండగా కార్యాలయం ముందు బైఠాయించారు.
ప్రోటోకాల్ పాటించడం లేదంటూ వైస్ ఎంపీపీ నిరసన
తనకు సమాచారం ఇవ్వకుండానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. స్పందించిన అధికారులు.. ఇక నుంచి మండల పరిధిలోని అన్ని శాఖ కార్యాలయాల నుంచి పరిషత్ సభ్యులందరికీ సమాచారం అందిస్తామని చెప్పటంతో సుమతి నిరసన విరమించారు.