ETV Bharat / state
వైభవంగా మన్యంకొండ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం - వెంకటేశుని కల్యాణం
కలియుగ దైవంగా పేరు గాంచిన మహబూబ్నగర్ జిల్లా మన్యంకొండ శ్రీ వెంకటేశ్వరుని కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ జరిగిన వేడుక భక్తులకు వీనులవిందు కలిగించింది.
వెంకటేశుని కల్యాణం
By
Published : Mar 22, 2019, 12:06 PM IST
| Updated : Mar 22, 2019, 12:19 PM IST
వేద మంత్రాల నడుమ స్వామివారి కల్యాణం మహబూబ్నగర్ జిల్లాలోని మన్యంకొండ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. పాలమూరు తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో ప్రతి ఏటా హోలీ పండుగ నాడు కల్యాణ వేడుక నిర్వహిస్తారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ అశేష భక్త వాహిని మధ్య అమ్మవారి మెడలో వెంకటేశ్వర స్వామి మంగళసూత్ర ధారణ చేశారు. ఉత్సవానికి వనపర్తి, నారాయణపేట జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. Last Updated : Mar 22, 2019, 12:19 PM IST