మహబూబ్నగర్ జిల్లా మన్యంకొండలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. రెండోరోజు ఉత్సవాల సందర్భంగా గ్రామోత్సవం నిర్వహించారు. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపును ప్రారంభించారు.
మన్యంకొండలో బ్రహ్మోత్సవాలు - mla
మన్యంకొండలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు.
మన్యంకొండ జాతర
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో.. కళ్యాణ మండపం నుంచి స్వామివారి గ్రామోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ప్రత్యేకంగా అలంకరించిన శకటంలో విద్యుత్ దీపాలంకరణ మధ్య స్వామివారిని ఊరేగించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఆలయాభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.
రానున్న రోజుల్లో మరిన్ని నిధులు కేటాయించి.. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు వివరించారు.
Last Updated : Feb 17, 2019, 7:10 AM IST