తెలంగాణ

telangana

ETV Bharat / state

విత్తనం వృథాగా పోకూడదు.. మొక్కగా పురుడుపోసుకోవాలి: వనజీవి - తెలంగాణ బొటానికల్ గార్డెన్ వార్తలు

విత్తనం వృథాగా పోకూడదని, మొక్కగా పురుడుపోసుకోవాలని పద్మశ్రీ వనజీవి రామయ్య అన్నారు. ఆహారం, వర్షాలు, ఆక్సిజన్, జీవవైవిధ్యం ఇలా జీవకోటికి అవసరమైన ఎన్నింటినో మొక్కలు తీర్చగలవని అందుకే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని సూచించారు. మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్ల బూర్గుల రామకృష్ణరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ బొటానికల్ గార్డెన్ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

vanajeevi ramaiah
vanajeevi ramaiah

By

Published : Mar 18, 2021, 9:58 AM IST

పర్యావరణ పరిరక్షణ, మానవ మనుగడ కోసం మొక్కలు నాటడాన్ని ప్రజలు దైవకార్యంగా భావించాలని పద్మశ్రీ వనజీవి రామయ్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్ల బూర్గుల రామకృష్ణరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ బొటానికల్ గార్డెన్ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. బొటానికల్ గార్డెన్​లో రామయ్య దంపతులు మొక్కలు నాటారు.

యువత సైన్స్​ను నమ్మాలని, మొక్కలు నాటడమూ సైన్సేనని రామయ్య వ్యాఖ్యానించారు. కాలుష్యం తగ్గించే దిశగా బయో ఇంధనాలు రావాలని ఆకాంక్షించారు. ఆహారం, వర్షాలు, ఆక్సిజన్, జీవవైవిధ్యం ఇలా జీవకోటికి అవసరమైన ఎన్నింటినో మొక్కలు తీర్చగలవని అందుకే ప్రతి ఒక్కరు మొక్కలు నాటడమే కాదు... వాటిని సంరక్షించడం కూడా బాధ్యతగా భావించాలని చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరిత హారం కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ చేయూత నివ్వాలని, తెలంగాణలో కోట్ల మొక్కలు పెరగడానికి దోహదం చేయాలన్నారు. విత్తనం వృథాగా పోకూడదని, మొక్కగా పురుడుపోసుకోవాలన్నారు. మొక్కలను పెట్టుబడిగా పెడితే.. దీర్ఘకాలంలో తరతరాలకు కావాల్సిన అనంత ఫలాలు అందిస్తాయని ఆయన గుర్తు చేశారు.

విత్తనం వృథాగా పోకూడదు.. మొక్కగా పురుడుపోసుకోవాలి: వనజీవి

ఇదీ చదవండి :గజ్వేల్‌లో కుప్పకూలిన మూడంతస్తుల భవనం

ABOUT THE AUTHOR

...view details