ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మహబూబ్నగర్ జిల్లాలోని వైష్ణవ ఆలయాల్లో తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ నెలకొంది. స్వయంభుగా శాశ్వత ఉత్తర ద్వారము కలిగిన మన్యంకొండలోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలో స్వామి వారు భక్తులకు అదే ద్వారం ద్వారా దర్శనమిచ్చారు. కలియుగ దేవునికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి.. ప్రధాన ఆలయం నుంచి పల్లకీలో ఉత్సవ మండపం వరకు గోవింద నామస్మరణతో తీసుకొచ్చారు.
గోవింద నామ స్మరణతో వేంకటేశ్వర స్వామి, చెన్నకేశవ ఆలయాలు
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మహబూబ్నగర్ జిల్లాలో వైష్ణవ ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. గోవింద నామ స్మరణతో ఆలయాల్లో ఆధ్యాత్మికత నెలకొంది. పాలమూరు తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన మన్యంకొండలోని వేంకటేశ్వర ఆలయంలో స్వామి వారు ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిచ్చారు.
గోవింద నామ స్మరణతో వేంకటేశ్వర స్వామి, చెన్నకేశవ ఆలయాలు
దేవరకద్రలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేతుడైన స్వామి వారు వైకుంఠ దర్శనం ద్వారా భక్తులకు కనువిందు చేశారు. ఆలయ అర్చకులు ఉత్తర ద్వారానికి ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకీ సేవ చేశారు. గోవింద నామ స్మరణతో ఆలయాల్లో ఆధ్యాత్మికత నెలకొంది.