సద్గురు త్యాగరాజు గానామృతానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఆరాధన మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ నాయి బ్రాహ్మణుల గానామృత ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
దేవరకద్రలో ఘనంగా త్యాగరాజు ఆరాధనోత్సవాలు - దేవరకద్రలో త్యాగరాజు ఆరాధనోత్సవాలు
సద్గురు త్యాగరాజు ఆరాధన మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో నాయి బ్రాహ్మణులు మంగళ వాయిద్యాలతో గానామృతం వినిపించారు. స్వర లహరి కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో వాయిద్యాకారులను సన్మానించారు.
దేవరకద్రలో ఘనంగా త్యాగరాజు ఆరాధనోత్సవాలు
స్వరలహరి కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో వాయిద్యకారులను అకాడమీ ప్రతినిధి, విశ్రాంత పోలీస్ అధికారి బాగన్న గౌడ్ సన్మానించారు. త్యాగరాజు శిష్యులుగా నాయి బ్రాహ్మణులు అందిస్తున్న గానామృతం మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తోందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి నాయి బ్రాహ్మణులు పాల్గొన్నారు.