వనపర్తి జిల్లా మెట్పల్లికి చెందిన చంద్రమ్మ దంపతులు పాత చీరలతో బొంతలను కుట్టి సంచార జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ కుటుంబం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని పుట్ట పల్లి గ్రామంలో ఉంటున్నారు. మంగళవారం సాయంత్రం తండ్రి ద్విచక్ర వాహనం మరమ్మతుల కోసం వెళ్లగా... తల్లి ఇంట్లో పనిచేసుకుంటోంది.
ప్రైవేటు పాఠశాల బస్సు ఢీకొని రెండేళ్ల చిన్నారి మృతి - మహబూబ్ నగర్ జిల్లా పుట్టపల్లి ప్రమాదంలో చిన్నారి మృతి
ఓ ప్రైవేటు పాఠశాల బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం... సంచారం చేస్తూ బొంతలు కుట్టుకుని అమ్ముకుని బతికే ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. తమ రెండేళ్ల చిన్నారిని ఢీకొట్టి పొట్టనపెట్టుకుంది. ఈ విషాధ ఘటన మహబూబ్ నగర్ జిల్లా పుట్టపల్లిలో చోటుచేసుకుంది.
ప్రైవేటు పాఠశాల బస్సు ఢీకొని రెండేళ్ల చిన్నారి మృతి
వారి రెండేళ్ల పాప అరవింద సమీపంలో ఉన్న శివాలయం కూడలిలో ఆడుకుంటుండగా... దేవరకద్రలోని ఓ ప్రైవేటు పాఠశాల బస్సు వచ్చి పాపను ఢీకొట్టింది. ఈ ఘటనలో పాప అక్కడికక్కడే మృతి చెందింది. తోటిపిల్లల అరుపులతో తల్లి వచ్చి బయట చూడగా... తమ కూతురు అచేతనంగా రక్తపు మడుగులో పడి ఉంది. చిన్నారి మృతదేహాన్ని ఎత్తుకొని తల్లి రోదించిన తీరు గ్రామస్థుల కంట కన్నీరు పెట్టించింది.
ఇవీ చూడండి: కళాశాల అధ్యాపకుడిని దారుణంగా కొట్టిన విద్యార్థులు
Last Updated : Nov 6, 2019, 11:22 AM IST