మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఓ పెట్రోల్ బంకులో మోటర్ సైకిల్‌కు అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. పరిస్థితిని గమనించిన యువకుడు బండి పక్కకు నిలిపివేసిన అనంతరం మంటలు ఎక్కువయ్యాయి. అక్కడ ఉన్న సిబ్బంది నీళ్లు పోసి మంటలను ఆర్పివేయగా త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది.
పెట్రోల్ బంకులో ద్విచక్ర వాహనానికి మంటలు - మహబూబ్ నగర్ లో బైక్ కు మంటలు
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఓ పెట్రోల్ బంకులో మోటర్ సైకిల్‌కు అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. అక్కడున్న సిబ్బంది మంటలను అదుపులోకి తేవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది.
జిల్లా కేంద్రంలోని ప్రేమ్‌నగర్‌కు చెందిన ఓ యువకుడు మోటర్‌సైకిల్ మరమత్తుల నిమిత్తం సంబంధిత వాహన ఆధీకృత డీలరు దగ్గర ఇచ్చారు. సర్వీసింగ్ పూర్తయిన తర్వాత... అక్కడి నుంచి నేరుగా ఓ పెట్రోల్ బంకు దగ్గరకు చేరుకుని పెట్రోల్ పోయిస్తుండగా ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన యువకుడు కాస్త దూరంలోకి తీసుకెళ్లి నిలిపివేశాడు. చూస్తుండగానే క్షణాల్లో మంటలు మోటర్‌సైకిల్‌ను చుట్టుముట్టాయి.
తేరుకున్న పెట్రోల్ బంకు సిబ్బంది నీళ్లను పోసి మంటలను అదుపులోకి తీసుకురాగా... పెద్ద ప్రమాదం తప్పింది. సర్వీసింగ్ చేసే క్రమంలో మోటర్ సైకిల్ ను మరమత్తుల చేసిన మెకానిక్ చేసిన తప్పిదంతో పెట్రోల్ లీక్ అయినట్టుందని.. అందువల్లనే మంటలు చెలరేగాయని యువకుడు వాపోయాడు.