తెలంగాణ

telangana

ETV Bharat / state

Urban Development Authorities in Telangana: కొత్తగా రెండు నగరాభివృద్ధి సంస్థలు - నీలగిరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ

Urban Development Authorities in Telangana : తెలంగాణలో కొత్తగా రెండు నగరాభివృద్ధి ప్రాధికార సంస్థలు(అర్బన్‌ డెవెలప్‌మెంటు అథారిటీలు) ఏర్పాటయ్యాయి. మహబూబ్​నగర్, నల్గొండ సమీప ప్రాంతాల అభివృద్ధి కోసం రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా నగరాభివృద్ధికి కమిటీలు ఏర్పాటు చేసి కలెక్టర్లను ఛైర్మన్​గా పురపాలక కమిషనర్​లను ఉపాధ్యక్షులుగా నియమించింది.

Urban Development Authorities in Telangana
Urban Development Authorities in Telangana

By

Published : Feb 15, 2022, 6:47 AM IST

Urban Development Authorities in Telangana : రాష్ట్రంలో కొత్తగా రెండు నగరాభివృద్ధి ప్రాధికార సంస్థలు (అర్బన్‌ డెవెలప్‌మెంటు అథారిటీలు) ఏర్పాటయ్యాయి. మహబూబ్‌నగర్‌, నల్గొండ, వాటి సమీప ప్రాంతాల అభివృద్ధి కోసం వీటిని ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్‌నగర్‌లో ఆ జిల్లా పేరిట, నల్గొండలో నీలగిరి ఉడా పేరిట వీటిని ఏర్పాటు చేయాలని నిర్దేశించింది.

కమిటీల ఏర్పాటు

Urban Development Authority in Nalgonda : ఆయా నగరాభివృద్ధి కమిటీలకు జిల్లా కలెక్టర్‌ ఛైర్మన్‌గా, పురపాలక కమిషనర్‌ ఉపాధ్యక్షులుగా ఉంటారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సభ్యులుగా అవకాశం ఇచ్చారు. నీలగిరి నగరాభివృద్ధి సంస్థలో నల్గొండ, నకిరేకల్‌ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, ఎమ్మెల్సీ కోటిరెడ్డిలు సభ్యులుగా నియమితులయ్యారు.

మూడేళ్ల కలకు నిరీక్షణ..

Urban Development Authority in Mahabubnagar : పాలమూరు జిల్లా ప్రజల.. మూడేళ్ల నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు ప్రభుత్వం మహబూబ్‌నగర్ నగర అభివృద్ధి ప్రాధికార సంస్థను ఏర్పాటు చేస్తూ జీవో జారీచేసింది. మూడు మున్సిపాలిటీలు మహబూబ్‌నగర్ చుట్టూ ఉన్న 20 కిలోమీటర్ల పరిధిలోని 12 మండలాల గ్రామాలని కలుపుతూ ముడాను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ నిర్ణయం ఈ ప్రాంతంలో ప్రణాళిక బద్ధమైన అభివృద్ధికి బాటలు వేస్తుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహా పాలమూరు జిల్లా నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.'

142 గ్రామాలతో ముడా..

Mahabubnagar Urban Development Authority : మహబూబ్‌నగర్, జడ్చర్ల, భూత్పూరు మున్సిపాలిటీలు సహా.. 12 మండలాల్లోని 142 గ్రామాలతో మహబూబ్‌నగర్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ-(ముడా) ఏర్పాటు కానుంది. 2020లో పట్టణప్రాధికారసంస్థ ఏర్పాటుచేయాలని కోరుతూ కలెక్టర్ వెంకట్రావు ప్రతిపాదనలు పంపగా.. ఏడాదిన్నర తర్వాత ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్రభుత్వనిర్ణయంతో ఈ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఏర్పడింది. ఈ ప్రాంతాభివృద్ధికి 40ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక మాస్టర్ ప్లాన్ సిద్ధమవుతుంది. కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి.. పథకాల నుంచి ఈ ప్రాంతానికి నిధులొస్తాయి. మంచినీరు, రహదారులు, పార్కులు, కూడళ్ల అభివృద్ధి, భూగర్భ మురుగు కాల్వల వ్యవస్థ.. వీధి దీపాలు, సుందరీకరణ అంతా ప్రణాళికాబద్ధంగా సాగనుంది. ముడా ఏర్పాటుతో ఉద్యోగావకాశాలు పెరగనున్నాయి. ముడా ఏర్పాటుపై పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌కు ధీటుగా మహబూబ్‌నగర్‌ అభివృద్ధిచెందుతుందని ధీమా వ్యక్తం చేశారు.

జిల్లా నేతల హర్షం..

Neelagiri Urban Development Authority : మహబూబ్‌నగర్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఏర్పడితే లేఅవుట్లు, ఇంటి నిర్మాణ అనుమతులు సంస్థ పరిధిలోకే వస్తాయి. మున్సిపాలిటీలు, గ్రామాల్లో ఇండ్ల స్థలాల క్రయవిక్రయాల్లో మోసాలు, డబుల్ రిజిస్ట్రేషన్లకు తెరపడుతుంది. ప్రస్తుతమున్న మున్సిపాలిటీలు, గ్రామాలు.. వాటి పాలక వర్గాలు అలాగే కొనసాగుతాయి. అభివృద్ధిమాత్రం ముడా పరిధిలో సాగుతుంది. సాధారణంగా కార్పొరేషన్లుగా ఉన్న అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలు ఏర్పాటు చేస్తుండగా మున్సిపాలిటీలున్న ప్రాంతానికి సర్కారు ప్రాధికార సంస్థను మంజూరు చేసింది. ముడా ఏర్పాటుపై జిల్లా నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..

ముడా కమిటీ సభ్యులు వీరే..

ప్రభుత్వ జీవో ప్రకారం ముడా కమిటీకి.. మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ వెంకట్రావు ఛైర్మన్‌గా, మహబూబ్‌నగర్ మున్సిపల్ కమిషనర్ వైస్‌ఛైర్మన్‌గా ఉంటారు. జడ్చర్ల శాసనసభ్యుడు లక్ష్మారెడ్డి, దేవరకద్ర శాసనసభ్యుడు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, సీడీఎంఏ కమిషనర్ సత్యనారాయణ సహా ఆర్థికశాఖ నుంచి ప్రత్యేక ముఖ్యకార్యదర్శి లేదా అదే శాఖ నుంచి నామినేట్‌ అయిన వ్యక్తి, పట్టణ ప్రణాళికశాఖ డైరెక్టర్.. సభ్యులుగా కొనసాగనున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details