మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పురపాలికలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. మొదటి రోజు ఎవరూ నామ పత్రాలు దాఖలు చేయలేదు. శనివారం ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి.
రెండో రోజు నామినేషన్ వేసిన ఇద్దరు అభ్యర్థులు
ఈనెల 30న ఎన్నికలు జరిగే పురపాలికల్లో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పురపాలికలో రెండో రోజు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
జడ్చర్ల, నామినేషన్లు
ఇప్పటికే భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ జడ్చర్లలో భాజపా కార్యాలయాన్ని ప్రారంభించారు. కరోనాతో జనం చస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పురపాలిక ఎన్నికలకు శ్రీకారం చుట్టిందని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి:30 లక్షలు దాటిన మరణాలు