మహబూబ్‌నగర్ జిల్లాలో తాజాగా రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పట్టణానికి చెందిన ఓ మహిళకు కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధితో బాధ పడుతున్న ఆమె హైదరాబాద్‌లో చికిత్స పొందుతోంది. పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ గా ఫలితాలు వచ్చాయి. ప్రభుత్వాసుపత్రిలో పొరుగు సేవల విభాగంలో పనిచేస్తున్న ఒకరికి కరోనా ఉన్నట్లు తాజా పరీక్షల్లో వెల్లడైంది. ఇటీవల నమోదైన ఓ కరోనా పాజిటివ్ కేసుకు అతను ప్రైమరీ కాంట్రాక్టు కావడం వల్ల పరీక్షలు నిర్వహించిన వైద్యాధికారులు నమూనాలను హైదరాబాద్ కు పంపగా.. కరోనా ఉన్నట్లుగా నిర్థారించారు.
పాలమూరులో రెండు కరోనా పాజిటివ్ కేసులు - పాలమూరులో పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం ఐదు
పాలమూరు జిల్లాలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పట్టణానికి చెందిన ఓ మహిళకు, ప్రభుత్వాసుపత్రిలో పొరుగు సేవల విభాగంలో పనిచేస్తున్న ఒకరికి కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు తెలిపారు. జిల్లాలో క్రీయాశీలంగా ఉన్న పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం ఐదుకు చేరింది.
జిల్లాలో క్రీయాశీలంగా ఉన్న పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం ఐదుకు చేరింది. పాలమూరు జిల్లా వ్యాప్తంగా అనుమానితులను, ప్రైమరీ కాంటాక్టులను ఎప్పటికప్పుడు వైద్యాధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఎస్వీఎస్ ఐసోలేషన్ వార్డులో 18 మంది, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఒకరు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాల నుంచి 17వేల మంది రాగా.. 14,600 మంది 14 రోజుల హోం క్వారంటైన్ పూర్తి చేసుకున్నారు. మరో 2,552 మంది హోం క్వారంటైన్లో కొనసాగుతున్నారు.
ఇదీ చూడండి:సీఎం కేసీఆర్‌కి రైతన్న బహుమానం