నీటి నిల్వ కోసం ఏర్పాటు చేసిన నీటి గుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. హన్వాడ మండలం మాధారం గ్రామానికి ఏడేళ్ల రజిత, ఐదేళ్ల మోక్షిత ప్రమాదవశాత్తు నీటిగుంటలో పడి మృతువాతపడ్డారు. తల్లిదండ్రులు ఇద్దరు సాయిలు, అంజమ్మలు కూలి పనుల నిమిత్తం జిల్లా కేంద్రానికి వెళ్లగా.. సెలవుల కారణంగా చిన్నారులు పొలానికి వెళ్లగా ఈ ఘటన జరిగింది. బహిర్భూమికి వెళ్లి నీటికుంట దగ్గరకు చేరుకున్న చిన్నారులు ప్రమావశాత్తు అందులో పడిపోయారు. సమీపంలోనే ఉన్న బంధువులు గమనించి బయటకు తీసేలోపే మృతిచెందారు. ఇద్దరు కుమార్తెలు ఒకేసారి మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
నీటిగుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి - Iddaru_Chinnarula mruthi
ప్రమాదవశాత్తు నీటిగుంటలో ఇద్దరు చిన్నారులు పడి మృతి చెందిన విషాద ఘటన మహబూబ్‌నగర్ జిల్లా మాధారంలో చోటుచేసుకుంది. తమ ఇద్దరు కుమార్తెలు మృతి చెందటంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

నీటిగుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి