'సానుకూల చర్చలకు అవకాశం ఇవ్వడం లేదు' - మహబూబ్‌నగర్ కలెక్టరేట్
ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ.. కార్మిక సంఘాల ఐకాస సహా విపక్షాల ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించారు.
మహబూబ్‌నగర్ కలెక్టరేట్ ముట్టడికి యత్నం
ఆర్టీసీ పరిరక్షణ కోసం తాము కోరిన డిమాండ్లన్నీ నెరవేర్చాలని కోరుతూ కార్మిక సంఘాల ఐకాస సహా విపక్షాల ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌ను ముట్టడించారు. కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చిన కాంగ్రెస్, సీపీఎం, ఐకాస కార్మికులు తొలుత బస్టాండ్ ఎదుట రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వం సానుకూల చర్చలకు అవకాశం ఇవ్వడం లేదని.. సమ్మె పరిష్కారంలో కేసీఆర్ చొరవ చూపడం లేదని ఐకాస నేతలు ఆరోపించారు. ప్రజలు, ఆర్టీసీ అన్నిరకాల ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలు జరపాలని కోరారు.
- ఇదీ చూడండి : 'యూనియన్లు పెట్టుకునే హక్కు ప్రతి కార్మికునికి ఉంది'