జితేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వనందుకు కేసీఆర్ను విమర్శిస్తే ఊరుకోబోమని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. జితేందర్ రెడ్డిని పార్టీలో గౌరవంగా చూసుకున్నామని.. పార్టీ మారగానే కేసీఆర్ను విమర్శించడం సరికాదన్నారు. పాలమూరులో ఈ నెల 31న జరగనున్న సీఎం సభకు జనం భారీగా హాజరు కావాలని శ్రీనివాస్ గౌడ్ కోరారు. జాతీయ స్థాయిలో తెరాస సహా ఇతర ఎంపీల మద్దతుతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా సాధిస్తామని చెప్పారు. మోదీ సభలో హామీలు, పథకాలతో మభ్యపెట్టే ప్రయత్నం చేసినా జనం నమ్మే స్థితిలో లేరన్నారు.
కేసీఆర్ను విమర్శిస్తే ఊరుకోం: శ్రీనివాస్ గౌడ్ - PALAMURU RANGAREDDY LIFT SCHEME
సీఎం కేసీఆర్ను ఎంపీ జితేందర్ రెడ్డి విమర్శించడం పట్ల ఆ పార్టీ పాలమూరు ఎమ్మెల్యేలు స్పందించారు. జితేందర్ రెడ్డిని పార్టీలో గౌరవంగా చూసుకున్నామని... పార్టీ మారగానే కేసీఆర్ను విమర్శించడం సరికాదన్నారు.
కేసీఆర్ను విమర్శిస్తే ఊరుకోబోం : మంత్రి శ్రీనివాస్ గౌడ్