తెలంగాణ

telangana

ETV Bharat / state

పాలమూరులో టీఆర్టీ అభ్యర్థుల ఆందోళన - dharna

పాలమూరులో టీఆర్టీ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఎంపికైన తమకు ఇంతవరకు పోస్టింగ్ ఇవ్వలేదని జిల్లా కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.

టీఆర్టీ అభ్యర్థుల ఆందోళన

By

Published : Apr 23, 2019, 7:39 PM IST

మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలోని విద్యాశాఖ అధికారి కార్యాలయం ముందు టీఆర్టీ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన తమకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. గత ఏడాది ఆగస్టులో ధ్రువపత్రాల పరిశీలన కూడా పూర్తయిందని వాపోయారు. ఆయినా కూడా ఇప్పటి వరకు పోస్టింగ్ కేటాయించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉద్యోగాలు కల్పించాలని కోరుతున్నారు.

టీఆర్టీ అభ్యర్థుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details