తెలంగాణ

telangana

ETV Bharat / state

TRS Won Mahabubnagar MLC Seats: తెరాస ఖాతాలో మరో రెండు ఎమ్మెల్సీ స్థానాలు.. - మహబూబ్​నగర్ జిల్లాలోని 2 ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం

TRS Won Mahabubnagar MLC Seats : స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్కొక్కొటిగా అధికార తెరాస ఏకగ్రీవం చేసుకుంటోంది. 12 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. ఇప్పటికే ఐదింటిని తెరాస తన ఖాతాలో వేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని రెండు స్థానాలు కూడా గులాబీ ఖాతాలోకి చేరాయి. పోటీకి దిగిన ఒకే ఒక్క అభ్యర్థి కూడా నామినేషన్‌ ఉపసంహరించుకోవడంతో ఎన్నిక లాంఛనం కానుంది.

TRS MLCs, TRS won 7 MLCs, Mahabubnagar MLCs, మహబూబ్​నగర్ ఎమ్మెల్సీలు, తెరాస ఎమ్మెల్సీ, ఎమ్మెల్సీ ఎన్నకలు 2021
స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు 2021

By

Published : Nov 25, 2021, 12:13 PM IST

Updated : Nov 25, 2021, 2:03 PM IST

TRS Won Mahabubnagar MLC Seats : ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లా స్థానిక సంస్థల రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. తెరాస అభ్యర్థులు మినహా బరిలో నిలిచిన ఏకైక స్వతంత్ర అభ్యర్థి కావలి శ్రీశైలం తన నామినేషన్​ను ఉపసంహరించుకోవడం వల్ల ఏకగ్రీవం లాంఛనం కానుంది.

two MLC Seats in Mahabubnagar district : నిజామాబాద్‌ స్థానం నుంచి కవిత నామినేషన్‌ ఒక్కటే మిగలగా.. ఆమె ఎన్నిక ఏకగ్రీవం కానుంది. రంగారెడ్డి జిల్లాలోనూ బరిలో ఎవరూ నిలవకపోవడంతో రెండు స్థానాలు తెరాస ఖాతాలోకి చేరాయి. శంభీపూర్‌ రాజు, పట్నం మహేందర్‌రెడ్డి అభ్యర్థులిద్దరే పోటీలో నిలిచారు. వీరి ఎన్నికను రేపు నామినేషన్ల ఉపసంహరణ తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు.

Local Body quota MLC elections 2021 : మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల శాసన మండలి స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన శ్రీశైలం వెనక్కి తగ్గారు. నామినేషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారికి రాతపూర్వకంగా తెలిపారు. పాలమూరు జిల్లా నుంచి బరిలో దిగిన తెరాస అభ్యర్థులు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి మాత్రమే పోటీలో మిగిలారు. ఈ రెండు స్థానాలకు సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమైంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత అధికారిక ప్రకటన వెలువడనుంది.

Telangana MLC elections 2021 : స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 12 స్థానాలకు ఎన్నికలు జరగుతుండగా.. ఇప్పటికే ఐదింటిని తెరాస తన ఖాతాలో వేసుకుంది. తాజాగా మహబూబ్​నగర్ జిల్లాలోని రెండు స్థానాలు కూడా తన ఖాతాలోకి చేరాయి.

ఇవీ చదవండి:

  • నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి నామినేషన్​పై నెలకొన్న ఉత్కంఠ వీడింది. అఫిడవిట్​లో తప్పుల కారణంగా స్వతంత్ర అభ్యర్థి కోటగిరి శ్రీనివాస్ నామినేషన్​ను ఎన్నికల అధికారి తిరస్కరించారు. స్వతంత్ర అభ్యర్థి సైతం పోటీలో లేకుండా పోవటం వల్ల... స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బరిలో తెరాస నుంచి నామినేషన్ దాఖలు చేసిన కల్వకుంట్ల కవిత ఎన్నిక ఏకగ్రీవం కానున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
  • స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల (Mlc Elections) నామినేషన్ల పరిశీలన ఒక్క వరంగల్ మినహా మిగతా ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లోనూ నిన్న పూర్తైంది. వరంగల్‌లో ఒక్క అభ్యర్థి పరిశీలన నేటికి వాయిదా పడింది. కరీంనగర్‌, ఆదిలాబాద్‌లో అత్యధికంగా 24 మంది చొప్పున అభ్యర్థులు బరిలో ఉన్నారు. నల్గొండలో ఎనిమిది మంది, ఖమ్మం, మెదక్, మహబూబ్ నగర్‌లో నలుగురు చొప్పున పోటీలో ఉన్నారు. ఇప్పటి వరకు... రెండు చోట్ల మాత్రమే పోలింగ్ అవసరం పడని పరిస్థితి కనిపిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
Last Updated : Nov 25, 2021, 2:03 PM IST

ABOUT THE AUTHOR

...view details