తెలంగాణ

telangana

ETV Bharat / state

Guvvala On Revanth: మల్కాజిగిరిలో మళ్లీ గెలిచే సత్తా రేవంత్‌రెడ్డికి ఉందా?: గువ్వల - తెరాస ఎమ్మెల్యేల ఫైర్

Guvvala On Revanth: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలపై తెరాస ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన ఒక పీసీసీ అధ్యక్షుడిలా మాట్లాడటం లేదన్నారు. కాంగ్రెస్‌- తెదేపా పాలనలో పాలమూరులో ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాలని ప్రశ్నించారు. హైదరాబాద్​లోని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలతో కలిసి మాట్లాడారు.

Guvvala On Revanth
గువ్వల బాలరాజు

By

Published : Mar 14, 2022, 5:45 PM IST

Guvvala On Revanth: వ్యాపారాలు చేసుకోడానికి పీసీసీ ప‌ద‌విని రేవంత్‌రెడ్డి వాడుకుంటున్నార‌ని మ‌హ‌బూబ్​న‌గ‌ర్​కు చెందిన తెరాస ఎమ్మెల్యేలు ఆరోపించారు. రేవంత్‌కు ధైర్యముంటే ప్రాజెక్టులపై చర్చకు రావాలని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సవాల్ విసిరారు. నిన్న కొల్లాపూర్ బ‌హిరంగ స‌భ‌లో రేవంత్ రెడ్డి చేసిన విమ‌ర్శ‌ల‌పై ఉమ్మ‌డి మ‌హ‌బూబ్​న‌గ‌ర్ జిల్లా ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు గువ్వ‌ల బాల‌రాజు, ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి, అబ్ర‌హం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.

గువ్వల గరంగరం

ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

తెదేపా, కాంగ్రెస్ ప్ర‌భుత్వాల వ‌ల్ల మ‌హ‌బూబ్​న‌గ‌ర్ జిల్లాకు ఏమైనా ప్ర‌యోజ‌నాలు జ‌రిగాయని గువ్వల ప్ర‌శ్నించారు. రేవంత్ రెడ్డి తన వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకుని క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌కుంటే ఆయ‌న ఎక్కడ నిల‌బ‌డిన ఓడిస్తామ‌ని హెచ్చ‌రించారు. స‌మాజంలో వ‌ల‌స‌బిడ్డ‌ల‌కు, ద‌ళితుల‌కు స‌మాజంలో విలువ లేదా అని బాల‌రాజు ప్ర‌శ్నించారు. బ్లాక్ మెయిల్ చేసి డ‌బ్బు సంపాదించుకోడానికే పీసీసీ ప‌ద‌విని కొనుక్కున్నార‌ని ఎమ్మెల్యేలు ఆరోపించారు. త్వరలోనే రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజ‌కీయాల‌ను బ‌య‌ట పెడ‌తామ‌ని హెచ్చరించారు.

రేవంత్‌రెడ్డి.. పీసీసీ అధ్యక్షుడిలా మాట్లాడటం లేదు. కాంగ్రెస్- తెదేపాతో పాలమూరుకు ఏం లబ్ధి కలిగింది? భయంతోనే కేంద్రంపై రేవంత్‌రెడ్డి మాట్లాడట్లేదు. పీసీసీ పదవిని వ్యాపారాల కోసం రేవంత్ వాడుకుంటున్నారు. రేవంత్‌కు ధైర్యముంటే ప్రాజెక్టులపై చర్చకు రావాలి. మల్కాజిగిరి ప్రజలకు నువ్వు ఒరగబెట్టిందో ఎందో చెప్పాలి. మల్కాజిగిరిలో మళ్లీ గెలిచే సత్తా రేవంత్‌రెడ్డికి ఉందా? ఎస్సీలు, సీఎంపై చేసిన వ్యాఖ్యలను రేవంత్‌ వెనక్కి తీసుకోవాలి.

- గువ్వల బాలరాజు, తెరాస ఎమ్మెల్యే

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details