మహబూబ్‌నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి సురభి వాణీదేవిని అఖండ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ రాములు కోరారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారం వారు పాల్గొన్నారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి అన్నారు. విద్యావంతురాలైన పీవీ నరసింహారావు కుమార్తెను ఎమ్మెల్సీగా గెలిపించాలని పట్టభద్రులను కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే విధానాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వివరించారు. పోలింగ్‌లో అందరూ పాల్గొనే విధంగా కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఒక్కో నాయకుడు 50 మంది పట్టభద్రులకు ఓటు వేసే విధానంపై అవగాహన కల్పించి.. ఓటు హక్కును వినియోగించుకునే చూడాలన్నారు.