తెలంగాణ

telangana

ETV Bharat / state

నేడు వనపర్తి, మహబూబ్​నగర్​లో కేసీఆర్ సభలు - wanaparthy

16 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా తెరాస ప్రచారాన్ని ముమ్మరం చేసింది. నేడు వనపర్తి, మహబూబ్​నగర్​లో జరిగే బహిరంగ సభలకు కేసీఆర్ హాజరుకానున్నారు.

నేడు కేసీఆర్ సభలు

By

Published : Mar 31, 2019, 5:31 AM IST

నేడు కేసీఆర్ సభలు
ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రకటన వెలువడిన అనంతరం తొలిసారి జిల్లాకు రానున్నారు. ముందుగా వనపర్తి పట్టణానికి సమీపంలోని నాగవరం చెరువు మైదానంలో ఏర్పాటు చేసిన సభకు సీఎం హాజరవుతారు. అనంతరం మహబూబ్​నగర్​లోని బూత్​పూర్ సభలో కేసీఆర్​ పాల్గొంటారు. వనపర్తి సభ ఏర్పాట్లను నిరంజన్ రెడ్డి పరిశీలించారు. ఏడు నియోజక వర్గాల నుంచి సుమారు లక్షకు పైగా ప్రజలు హాజరవుతారని తెలిపారు. సభను విజయవంతం చేయాలని మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు. మహబూబ్​నగర్ సభకు పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించే పనిలో గులాబీ శ్రేణులు నిమగ్నమయ్యారు.

ABOUT THE AUTHOR

...view details