తెలంగాణ

telangana

ETV Bharat / state

పంపిణీ గొర్రెలు అమ్ముతుండగా..

ప్రభుత్వం కోట్లు వెచ్చించి గొర్రెలు పంపిణీ చేస్తోంది. వాటి పోషణతో ఉపాధి కలుగుతుందని చెబుతోంది. కానీ కొందరు అక్రమార్కులు ఇలా వాటిని పంపిణీ చేయగానే.. అలా విక్రయానికి పెడుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఇలాగే అమ్మడానికి తీసుకుపోతున్న 450 గొర్రెలను పోలీసులు పట్టుకున్నారు.

పంపిణీ గొర్రెలు అమ్ముతుండగా..

By

Published : Feb 26, 2019, 3:21 PM IST

పంపిణీ గొర్రెలు అమ్ముతుండగా..
మహబూబ్​నగర్​ జిల్లా మరికల్​ గ్రామం నుంచి నల్గొండకు అక్రమంగా తరలిస్తున్న 450 గొర్రెలను జడ్చర్ల పోలీసులు అడ్డుకున్నారు. 9 వాహనాలను పోలీస్​స్టేషన్​కు తరలించారు. వీటి విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందని అంచనా. తరలించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెల విక్రయం నేరమని పశుసంవర్ధక శాఖ అధికారులు తెలిపారు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న గొర్రెలను తిరిగి నూతన లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details