మహబూబ్నగర్ జిల్లా కలెక్టరేట్లో పౌర సరఫరాల సంస్థ నిర్వహించిన టెండర్లలో బిడ్లు దాఖలు చేసేందుకు మహబూబ్నగర్, జడ్చర్ల లారీ యజమానులు ఇరు వర్గాలుగా కార్యాలయానికి వచ్చారు. బిడ్లు దాఖలు చేసే క్రమంలో ఒకరికొకరు వాదోపవాదనలు చేసుకున్నారు. ఈ మేరకు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఉద్రిక్త పరిస్థితుల్లో రవాణా టెండర్ల బిడ్ దాఖలు - mahabubnagar transport tender bid latest news
మహబూబ్నగర్ కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన రవాణా టెండర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరువర్గాలుగా ఏర్పడిన లారీ యజమానులు టెండర్లను అడ్డుకునేందుకు యత్నించగా పోలీసులు వారిని చెదరగొట్టారు.
![ఉద్రిక్త పరిస్థితుల్లో రవాణా టెండర్ల బిడ్ దాఖలు transport tender bid by lorry owners at mahabubnagar collector office](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8940046-1010-8940046-1601051382650.jpg)
ఉద్రిక్త పరిస్థితుల్లో మహబూబ్నగర్లో రవాణా టెండర్ల బిడ్ దాఖలు
ఒకరిపై ఒకరు దాడి చేసుకునేంత వరకు వెళ్లగా పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అడ్డుకున్నారు. టెండర్ సమయం ముగిసిన తర్వాత ఇరు వర్గాల వారిని అక్కడి నుంచి పంపించేశారు. అనంతరం అదనపు కలెక్టర్ సీతారామారావు సమక్షంలో అధికారులు టెండర్ బాక్సుకు సీల్ వేశారు.