మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో ఆర్ఓబీ నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. వంతెన కోసం సిమెంట్ పిల్లర్ల కోసం భారీస్థాయిలో నడిరోడ్డుపై గుంతలు తీసి సిమెంట్ దిమ్మెల నిర్మాణం చేపట్టారు. ఆ పక్క నుంచి 167 జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఇరుకైన రహదారిలో ఓ భారీ వాహనం మధ్యలో నిలిచిపోయింది. లారీ అడ్డుగా ఉన్నందున అరగంట పాటు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు స్తంభించాయి. విషయం తెలుసుకున్న పోలీసులు యువకుల సాయంతో వాహనాన్ని అక్కడినుంచి తొలగించే ప్రయత్నం చేశారు. ప్రయత్నం విఫలం కావడం వల్ల క్రేన్‌ని రప్పించారు. లారీకి గొలుసులు కట్టి క్రేన్ సాయంతో దానిని తొలగించారు.
ఒక్క లారీతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ - 167 జాతీయ రహదారిపై నిలిచిపోయిన వాహనాల రాకపోకలు
అసలే ట్రాఫిక్ రద్దీ... అది చాలదన్నట్లు ఆ ఇరుకైన రహదారిలో భారీ లారీ నిలిచిపోయింది. రెండు జిల్లాలను కలుపుతూ వెళ్లే జాతీయ రహదారిపై లారీ అడ్డుగా ఉన్నందున అక్కడి నుంచి ఒక్క వాహనం కూడా ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారు.
![ఒక్క లారీతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4739237-155-4739237-1570965384544.jpg)
ఒక్క లారీతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్
ఒక్క లారీతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్
TAGGED:
TRAFFIC JAM AT MAHABUB NAGAR