రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా తక్కువ ధరకే ఇసుకను సరఫరా చేయనున్నట్లు పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. టీఎస్ఎండీసీ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని బండమీదిపల్లిలో ఇసుక ఉప నిలువ కేంద్రాన్ని ప్రారంభించారు. భవన నిర్మాణ రంగంలో ఇసుక పాత్ర కీలకమని, దళారుల కారణంగా విపరీతంగా డిమాండ్ పెరిగి ప్రభుత్వ పనులతోపాటు, ప్రైవేటు వ్యక్తులకు కూడా అందడం కష్టంగా మారిందన్నారు.
దళారులు ఇసుకను కొల్లగొట్టాలని చూస్తే కఠిన చర్యలే: శ్రీనివాస్‌గౌడ్ - Telangana news
టీఎస్ఎండీసీ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని బండమీదిపల్లిలో ఇసుక ఉప నిలువ కేంద్రాన్ని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు. టన్ను ఇసుక కేవలం రూ. 900కే ఇస్తామని మంత్రి పేర్కొన్నారు.

సామాన్యులకు తక్కువ ధరకు ఇసుక దొరికేలా ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టిందని మంత్రి చెప్పారు. బుక్ చేసుకోగానే ఇంటికొచ్చి ఇసుకను సరఫరా చేస్తారని వెల్లడించారు. ఇదివరకే ఈ పద్ధతి అమలులో ఉన్నప్పటికీ ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం, జిల్లాలోని ప్రజలకు నిరంతరం ఇసుక అందుబాటులో ఉండేందుకు ఇసుక ఉప నిలువ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
టన్ను కేవలం రూ. 900కే ఇస్తామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎవరైనా దళారీలు ఇసుకను బుక్ చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇసుక సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా పోలీసుసలు నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
- ఇదీ చూడండి :'కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రత్యక్ష బోధన'