దొంగలు ఆలయంలో దేవుణ్ని సైతం వదలడం లేదు. మహబూబ్‌నగర్ జిల్లా నరసింహ స్వామి ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు హుండీలోని నగదు, కానుకలు దోచుకెళ్లారు.
లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం
By
Published : Feb 9, 2019, 4:04 PM IST
ఆధారాలు సేకరిస్తున్న ఫోరెన్సిక్, క్లూస్‌టీం
మహబూబ్‌నగర్ జిల్లా మాగనూరు మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో చోరీ జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి దుండగులు ఆలయంలో ప్రవేశించి హుండీని పగలగొట్టి నగదు ఎత్తుకెళ్లారు. ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగలించిన సొమ్ము లక్ష రూపాయల వరకూ ఉంటుందని స్థానికులు పేర్కొన్నారు. ఫోరెన్సిక్ బృందం, క్లూస్‌టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు.