తెలంగాణ

telangana

ETV Bharat / state

మణప్పురంలో బంగారం చోరీకి విఫలయత్నం - Thieves Attempt to steal gold in Manappuram gold

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్న మణప్పురం గోల్డ్ లోన్ సంస్థలో చోరీకి దుండగులు విఫల యత్నం చేశారు. శని, ఆదివారం సెలవు దినం కావడంతో గోడలకు రంధ్రాలు చేసి లోపటికి చొరబడేందుకు యత్నించారు. అయితే సాధ్యపడకపోవడంతో తమ ప్రయత్నం విరమించుకున్నట్లు తెలుస్తోంది.

Attempt to steal gold in Manappuram
మణప్పురంలో బంగారం చోరీకి విఫలయత్నం

By

Published : Nov 16, 2020, 9:01 PM IST

మహబూబ్ నగర్ పట్టణంలోని రాజీవ్ కూడలిలో ఎంబీసీ కాంప్లెక్స్ లోని పై అంతస్తులో మణప్పురం గోల్డ్ లోన్ సంస్థ కార్యాలయం ఉంది. శని,ఆదివారాలు సెలవు. ఇదే అదనుగా భావించిన దొంగలు తమ చేతివాటం చూపేందుకు మంచి సమయం అనుకున్నారు. పక్కనే ఏపీజీవీబి బ్యాంక్ తో పాటు.. ఫ్లెక్సీ బ్యానర్లు తయారు చేసే దుకాణాలు కూడా ఉన్నాయి. పథకం ప్రకారం ముందుగా బ్యాంక్ తాళాలు పగుల కొట్టే ప్రయత్నం చేశారు. అది వారికి సాధ్యం కాలేదు. దీంతో మెట్ల మార్గం పక్కనే ఫ్లెక్సీ బ్యానర్లు తయారు చేసే దుకాణంలోకి రంధ్రం చేసి చొరబడ్డారు. అందులో నుంచి మణప్పురం గోల్డ్ సంస్థలోకి పోయేందుకు యత్నించారు. ఈ ప్రయత్నమూ ఫలించక వచ్చినదారినే వెనుదిరిగారు దుండగులు.

సోమవారం ఉదయం మణప్పురం గోల్డ్ సంస్థ మేనేజర్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. అయితే తమ సంస్థలలో ఏమీ చోరీకి గురి కాలేదని సంబంధిత సంస్థల అధికారులు పేర్కొన్నారు.

ఇవీ చదవండి: చైన్​స్నాచింగ్​ ముఠా అరెస్ట్​... 7 లక్షల బంగారం స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details