ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెతోనే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని.. ఇప్పుడు అదే కార్మికులను సీఎం కేసీఆర్ డిస్మిస్ చేస్తాననడం హాస్యాస్పదమని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని రీజనల్ కార్యాలయ ఆవరణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు ఆయన మద్దతు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్‌లు న్యాయపరమైనవేనని వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై కేంద్ర,రాష్ట్ర భాజపా సమావేశాల్లో చర్చిస్తామని స్పష్టం చేశారు. సమ్మెకు ఐఎన్‌టీయూసీ, ఇప్టూ కార్మికులు మద్దతు పలకగా తాము ఆర్టీసీ కార్మికుల వెన్నంటే ఉంటామని హామీ ఇచ్చారు.
'ఆర్టీసీ కార్మికులు లేనిదే ఉద్యమం లేదు.. డిమాండ్లు నెరవేర్చాలి' - ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెతోనే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ రీజనల్ కార్యాలయ ఆవరణలో కార్మికులు సమ్మె చేపట్టారు. ఆర్టీసీ కార్మికుల వెన్నంటే తాము ఉంటామని భాజపా నేత జితేందర్ రెడ్డి హామీ ఇచ్చారు.
!['ఆర్టీసీ కార్మికులు లేనిదే ఉద్యమం లేదు.. డిమాండ్లు నెరవేర్చాలి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4672192-thumbnail-3x2-jithu.jpg)
మహబూబ్‌నగర్ ఆర్టీసీ రీజనల్ కార్యాలయ ఆవరణలో కార్మికుల సమ్మె
మహబూబ్‌నగర్ ఆర్టీసీ రీజనల్ కార్యాలయ ఆవరణలో కార్మికుల సమ్మె
ఇవీ చూడండి : మోగిన నగారా... అక్టోబర్ 21న హుజూర్నగర్ ఉపఎన్నిక