మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని పేరూరు గ్రామానికి చెందిన వెంకటేష్ వ్యవసాయం చేసుకుంటూ తన ఇద్దరు కూతుళ్లను, కుమారుణ్ని విద్యావంతులను చేయాలనే కోరికతో కష్టపడుతూ వారిని చదివిస్తున్నాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన.. ఆరోగ్య పరిస్థితి విషమించటం వల్ల కర్నూలు ఆస్పత్రిలో చేర్పించారు. బుధవారం రాత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
తండ్రి మరణ వార్త.. బరువెక్కిన గుండెతో 'పది' పరీక్షకు.! - The student attended the tenth class examination where the father died
ఆ విద్యార్థి తెల్లారితే పదో తరగతి పరీక్ష రాయాలి. పరీక్ష రాసేందుకు సిద్ధమైన బాలుడికి తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన తండ్రి మరణవార్త కలచివేసింది. పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకోవాలనే తన తండ్రి కోరిక మేరకు దుఃఖాన్ని పంటి బిగువున పెట్టుకొని పరీక్షకు హాజరయ్యాడు.

బరువెక్కిన గుండెతో 'పది' పరీక్షకు..
పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న కుమారుడు రవికి ఈ విషయం తెలిసి దుఃఖసాగరంలో మునిగిపోయాడు. పుట్టెడు శోకాన్ని పంటి బిగువున అదిమిపెట్టుకొని తొలిరోజు పదోతరగతి పరీక్షకు హాజరయ్యాడు. విషయం తెలుసుకున్న మిత్రులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.
బరువెక్కిన గుండెతో 'పది' పరీక్షకు..
ఇదీ చదవండిః'కరోనా'పై ప్రధాని అత్యున్నత స్థాయి సమీక్ష