కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కాంగ్రెస్ చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. మహబూబ్‌నగర్ ఆర్అడ్బీ అతిథి గృహం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించిన శ్రేణులు కలెక్టరేట్ ప్రాంగణంలోకి చొచ్చుకువచ్చాయి. జడ్చర్ల, దేవరకద్ర, మహబూబ్‌నగర్ నియోజకవర్గాల నుంచి నాయకులు రాగా, ఎన్ఎస్యూఐ విద్యార్థులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ పాలన కారణంగా దేశం, రాష్ట్రం దివాళా తీసే పరిస్థితి ఏర్పడిందని... ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి ఆరోపించారు. పోలీసులు అణచివేతతో ప్రజాగ్రహాన్ని చల్లార్చలేరన్నారు. అనంతరం చల్లా వంశీచంద్ రెడ్డి సహా కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యూఐ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు.
కాంగ్రెస్ కలెక్టరేట్ ముట్టడి... ఉద్రిక్తత - tcongress protest
మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి స్వల్ప ఉద్రిక్తత దారితీసింది.
పాలమూరు కలెక్టరేట్ ముట్టడి