మహబూబ్‌నగర్ జిల్లా తెలంగాణ నాన్-గెజిటెడ్ అధికారుల సంఘం ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి కార్యవర్గాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. ఈ నెల 31న మహబూబ్‌నగర్‌లో ఐటీ టవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. 400 ఎకరాల స్థలంలో 100 కోట్లతో ఐటీ పార్క్‌ను పాలమూరులో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఐటీ టవర్‌ను ఐదెకరాల్లో నిర్మించి ఆ తర్వాత దశల వారీగా పార్కును అభివృద్ధి చేస్తామన్నారు.
నూతన కార్యవర్గం హుందాగా వ్యవహరించాలి: శ్రీనివాస్ గౌడ్ - ఈ నెల 31న మహబూబ్‌నగర్‌లో ఐటీ టవర్ నిర్మాణానికి శంకుస్థాపన
ఈ నెల 31న మహబూబ్‌నగర్‌లో ఐటీ టవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా తెలంగాణ నాన్-గెజిటెడ్ అధికారుల సంఘం నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి హాజరయ్యారు.
![నూతన కార్యవర్గం హుందాగా వ్యవహరించాలి: శ్రీనివాస్ గౌడ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4904834-364-4904834-1572403399970.jpg)
నూతన కార్యవర్గం హుందాగా వ్యవహరించాలి :శ్రీనివాస్ గౌడ్
దేశవిదేశాల ఐటీ కంపెనీలు తమ పరిశ్రమలను ఈ పార్కులో నెలకొల్పేలా చొరవ తీసుకుంటున్నట్లు తెలిపారు. పాలమూరు పట్టణాన్ని విద్య, వైద్యం, ఐటీ, రవాణా, పర్యటకం సహా అన్ని రకాలుగా అభివృద్ది చేసేందుకు సర్కారు చేస్తున్న కృషిని ఆయన వివరించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ఉద్యోగ సంఘాలు, బంగారు తెలంగాణ సాధనలోనూ ముందుండాలని ఆయన ఆకాంక్షించారు.
నూతన కార్యవర్గం హుందాగా వ్యవహరించాలి :శ్రీనివాస్ గౌడ్
ఇదీ చూడండి : వెంటాడుతున్న కబ్జాదారులు.. పోలీసులే న్యాయం చేయాలి!