మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మొనప్పగుట్టలోని అయ్యప్పమాలధారులకు పట్టణానికి చెందిన పలువురు ముస్లిం సోదరులు అల్పహారం ఏర్పాటు చేసి మతసామరస్యాన్ని చాటారు. ఎంతో కఠోరమైన అయ్యప్ప దీక్ష చేస్తున్న భక్తులకు సేవ చేయడం ఎంతో సంతృప్తినిచ్చిందని అభిప్రాయపడ్డారు. కుల మతాలు వేరైనా మానవత్వంతో సమభావనతో మెలగాలని కోరారు. అందులో భాగంగా అయ్యప్ప స్వాములకు అల్పహారం అందించడమే కాకుండా వారితో పాటు కలసి భూజించడం తమకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు.
మత సామరస్యాన్ని చాటుకున్న ముస్లిం సోదరులు - The Muslim brothers who practiced religious harmony in Mahabubnagar district
మత సామరస్యానికి మన దేశం ప్రతీకగా నిలుస్తోంది. ఒకరి పండగలకు మరొకరు హాజరవుతూ ఉంటారు. అలాగే కులమతాలకు అతీతంగా ముస్లింలు అయ్యప్ప స్వామిపై తమ భక్తిని చాటుకున్నారు. ఐక్యతకు చిహ్నంగా అయ్యప్ప స్వాములకు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ముస్లిం సోదరులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

మత సామరస్యాన్ని చాటుకున్న ముస్లిం సోదరులు
మత సామరస్యాన్ని చాటుకున్న ముస్లిం సోదరులు