తెలంగాణ

telangana

ETV Bharat / state

పట్నం పొమ్మంటోంది.. పల్లె వద్దంటోంది.! - కరోనా కష్టాలు

కరోనా కష్టాలు పాలమూరు ప్రజానీకాన్ని పట్టి పీడిస్తున్నాయి. పొట్టకూటి కోసం పట్టణానికి వలస వెళ్ళిన.. కుటుంబాలను పట్టణం వెళ్లి పొమ్మంటుంది. రవాణా సౌకర్యాలు లేక కాలినడకన సొంత గ్రామాలకు వెళుతున్న వారికి పల్లె రావద్దని ముళ్ల కంపలు వేసి అడ్డుపడుతున్నా దయనీయ పరిస్థితి పాలమూరు వలస కూలీలకు ఎదురవుతోంది.

The difficulty of the villagers being unable to go to their own villages in Mahabubnagar district
పట్నం పొమ్మంటుంది.... పల్లె వద్దంటుంది

By

Published : Mar 24, 2020, 11:58 PM IST

పాలమూరు పల్లెల నుంచి పట్టణానికి వలస వెళ్ళిన కూలీలను అక్కడుండే పట్టణ వాసులు స్వగ్రామాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. వెళ్లేందుకు రవాణా సౌకర్యాలు లేక నానా ఇబ్బందులు పడుతూ కాలినడకన పల్లెలకు చేరుతున్నా వలస కూలీలకు.. గ్రామ సరిహద్దుల్లోనే ముళ్ల కంపలు అడ్డుపడుతున్నాయి.

మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని వివిధ గ్రామాలలో చుట్టూ సరిహద్దులకు ముళ్ళ కంప వేసి.. తమ గ్రామాలకు ఎవరూ రావద్దని గ్రామస్థులు కాపు కాస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వలస కూలీలు ఎటు పోవాలో పాలుపోక.. రహదారుల వెంట చెట్ల నీడన సేద తీరుతున్నారు. తాగేందుకు నీరు దొరకక, తినేందుకు తిండి దొరకక, ఆకలి దప్పికలను పంటి బిగువున పెట్టుకొని బాధలు అనుభవిస్తున్నట్లు వాపోయారు. సొంత గ్రామాలకు వెళ్లేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించాలని వేడుకుంటున్నారు.

పట్నం పొమ్మంటుంది.... పల్లె వద్దంటుంది

ఇదీ చూడండి:మా ఊరికి మీరు రావొద్దు... మీ ఊరికి మేమురాము

ABOUT THE AUTHOR

...view details