మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని డోకూరులో కొందరు మిత్రులు రాక్ స్టార్ పేరుతో బృందాన్ని ఏర్పాటు చేశారు. బృందంలో ఒకరైన పాండు హైదరాబాద్లో కూలి పని చేస్తుండగా నాలుగో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కింద పడి మరణించాడు. మిత్రుడి మరణ వార్త విన్న స్నేహితులు వారి సంకల్పానికి కారకుడైన పాండు జ్ఞాపకార్థం చదువుకున్న పాఠశాలలో సరస్వతి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అనుకున్నారు. ఉపాధ్యాయుల దినోత్సవం పురస్కరించుకుని పాఠశాలలో గ్రామ పెద్దల సమక్షంలో విగ్రహాన్ని ఆవిష్కరించారు.
స్నేహితుడి సంకల్పం నెరవేర్చిన మిత్రులు - school
మిత్రులందరూ ఒకే పాఠశాలలో చదువుకున్నారు. మిత్ర బృందంగా ఏర్పడి చదువుకున్న విద్యాలయానికి ఏదైనా చేయాలనుకున్నారు. కానీ వారి సంకల్పానికి కారకుడైన స్నేహితుడు ప్రమాదవశాత్తు మరణించాడు. ఆ మిత్రుడి జ్ఞాపకార్థంగా పాఠశాలలో సరస్వతి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
సరస్వతి విగ్రహం ఆవిష్కరిస్తున్నపాండు మిత్రులు