గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం తమకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని రాష్ట్ర ఎంపీటీసీల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఓ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఎంపీటీసీల చైతన్య సదస్సులో తీర్మానించారు.
గ్రామ ప్రజల సంక్షేమం కోసం ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ప్రతినిధులుగా ఎన్నికైనా ఎటువంటి అభివృద్ధి పనులకు నోచుకోలేకుండా ఉన్నామని ఎంపీటీసీలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు స్థానిక సంస్థలైన జిల్లా, మండల పరిషత్‌ల నుంచి తమకు అధికారులను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.