Rajapur PHC doctor suspended: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ముప్పు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉండటంతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలు జిల్లాలకు అప్రమత్తత ప్రకటించింది. మహబూబ్‌నగర్ జిల్లాలో 15 రోజుల్లో 100 శాతం సాధించే విధంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను కలెక్టర్ ఎస్. వెంకట్రావు వేగవంతం చేశారు. అందులో భాగంగా మహబూబ్‌నగర్ పట్టణం భగీరథకాలనీ, భూత్పూర్ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. పీహెచ్సీలో వ్యాక్సినేషన్ జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు. అనంతరం రాజాపూర్ పీహెచ్సీలో ఆకస్మిక తనిఖీలు చేశారు.
Rajapur PHC doctor suspended: వ్యాక్సినేషన్‌పై నిర్లక్ష్యం.. పీహెచ్సీ డాక్టర్ సస్పెండ్ - collector suspended rajapur phc doctor
Rajapur PHC doctor suspended: కొవిడ్ వ్యాక్సినేషన్లో భాగంగా విధుల్లో లేని పీహెచ్సీ వైద్యుడిపై సస్పెన్షన్ వేటు పడింది. మహబూబ్‌నగర్‌లోని రాజాపూర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ వెంకట్రావు.. పీహెచ్సీ డాక్టర్‌ను సస్పెండ్ చేశారు.
ఈ క్రమంలో రాజాపూర్ పీహెచ్సీలో జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో వైద్యుడు లేకపోవడాన్ని కలెక్టర్ గమనించారు. వ్యాక్సినేషన్‌పై నిర్లక్ష్యం వహించినందుకు గాను సదరు పీహెచ్సీ డాక్టర్. ప్రతాప్ చౌహన్‌ను కలెక్టర్ వెంకట్రావు సస్పెండ్ చేశారు. వైద్యాధికారులు, ప్రత్యేకాధికారులు వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. పీహెచ్సీ సిబ్బంది, వైద్యులు ఉదయమే గ్రామాలకు వెళ్లాలని.. టీకా వేసుకోని వారిని గుర్తించి వ్యాక్సిన్ వేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యాక్సినేషన్ పట్ల పీహెచ్సీ వైద్యులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
ఇదీ చదవండి:DH on Omicron : ఒమిక్రాన్ ముప్పు పొంచి ఉంది... తస్మాత్ జాగ్రత్త