తుంగభద్ర పుష్కరాలపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకే పుష్కరాల నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. పదేళ్లలోపు పిల్లలు, గర్భిణీలు, 65 ఏళ్ల పైబడినవారు పుష్కరాలకు రావొద్దని సర్కారు సూచించింది. కరోనా లేదని నెగిటివ్ రిపోర్టుతో వచ్చిన వారికే పుష్కరఘాట్లకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.
కరోనా నెగిటివ్ రిపోర్టు ఉంటేనే పుష్కరస్నానం.. - tungabhadra pushkaralu
తుంగభద్ర పుష్కరాలపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా లేదని నెగిటివ్ రిపోర్టుతో వచ్చిన వారికే పుష్కరఘాట్లకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. కరోనా లక్షణాలున్న వారిని పుష్కరఘాట్లకు అనుమతించేది లేదని ప్రభుత్వం పేర్కొంది.
![కరోనా నెగిటివ్ రిపోర్టు ఉంటేనే పుష్కరస్నానం.. telangana government released guidelines to tungabhadra pushkar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9577648-400-9577648-1605677900025.jpg)
telangana government released guidelines to tungabhadra pushkar
టెస్టు రిపోర్టు లేకుండా వచ్చే వారికి ధర్మల్ స్క్రీనింగ్ అనంతరం అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపింది. కరోనా లక్షణాలున్న వారిని పుష్కరఘాట్లకు అనుమతించేది లేదని ప్రభుత్వం పేర్కొంది. పుష్కరఘాట్లు, ఆలయ ప్రవేశ ద్వారాల వద్ద తప్పనిసరిగా శానిటైజర్లు, ధర్మల్ స్క్రీనింగ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మాస్కు ధరిచడం, ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాలని సూచించింది. కొవిడ్ నిబంధనలకు లోబడి పుష్కరస్నానాలు చేసేందుకు అనుమతిస్తూ... ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.