తెలంగాణ

telangana

ETV Bharat / state

వట్టెం నిర్వాసితులకు సహాయ, పునరావాస ప్యాకేజీ - palamuru rangareddy project

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న వట్టెం జలాశయ నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం... సహాయ, పునరావాస ప్యాకేజీ ప్రకటించింది.

వట్టెం నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ

By

Published : Nov 14, 2019, 10:14 AM IST

వట్టెం నిర్వాసితులకు సహాయ, పునరావాస ప్యాకేజీ

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న వట్టెం జలాశయ నిర్వాసితులకు 53.23 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటిస్తూ నీటిపారుదల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

397 కుటుంబాలు.. 69 మంది యువత

బిజినేపల్లి మండలం అన్నెఖాన్​పల్లి తండా, కారుకొండ తండా, రామిరెడ్డిపల్లి తండా, తిమ్మాజీపేట్ మండలం జి.గుట్టతండాలోని కుటుంబాలకు ప్యాకేజీ ఇవ్వనున్నట్లు పేర్కొంది. మొత్తంగా 397 కుటుంబాలతో పాటు 69 మంది 18ఏళ్ళు పైబడిన వారికి వర్తిస్తుందని తెలిపింది.

7.50 లక్షల పరిహారం

ప్యాకేజీలో భాగంగా ఒక్కో కుటుంబానికి రెండుపడక గదుల ఇళ్ల కోసం 5.04 లక్షల రూపాయలు, 7.50 లక్షల రూపాయల పరిహారం, 250 చదరపు గజాల స్థలం ప్రభుత్వం ఇవ్వనుంది. 18 ఏళ్ళు పైబడిన 69 మందికి 5 లక్షల రూపాయల పరిహారంతోపాటు 250 చదరపు గజాల స్థలం ఇస్తామని పేర్కొంది.

వట్టెం జలాశయ నిర్వాసితుల పునరావాస ప్యాకేజీ :

  1. 14.26 కోట్ల రూపాయలతో ప్యాకేజీ ప్రకటిస్తూ నీటిపారుదల శాఖ ఉత్తర్వులు..
  2. 111 నిర్వాసిత కుటుంబాలతో పాటు 18 ఏళ్ళు పైబడిన ఏడుగురికి పరిహారం
  3. ఒక్కో నిర్వాసిత కుటుంబానికి రెండు పడక గదుల ఇళ్ళ కోసం 5.04 లక్షల రూపాయలు, 7.50 లక్షల పరిహారం
  4. 18 ఏళ్ళు పైబడిన వారికి ఐదు లక్షల రూపాయల పరిహారం

కాళేశ్వరం నిర్వాసితులకూ ప్యాకేజీ

కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఎర్రవల్లి, సింగారం, ములుగు మండలం మామిడ్యాల, తానే దార్ పల్లి, బహిలంపూర్ గ్రామాల నిర్వాసిత కుటుంబాలకు కూడా సహాయ, పునరావాస ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించింది.

ABOUT THE AUTHOR

...view details