తెలంగాణ

telangana

ETV Bharat / state

'పల్లెల్లో ప్రగతి పరుగులు పెట్టాలి' - మహబూబ్​నగర్​లో తెలంగాణ ఆబ్కారీ శాఖ మంత్రి పర్యటన

పల్లెలను ప్రగతి దిశగా పరుగులు పెట్టించాల్సిన బాధ్యత సర్పంచ్​లు సహా ప్రజాప్రతినిధులపై ఉందని మంత్రి శ్రీనివాస్​గౌడ్​ అన్నారు. మహబూబ్​నగర్​ జిల్లాలోని గ్రామపంచాయతీలకు ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మహబూబ్​నగర్​లో మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ పర్యటన

By

Published : Nov 4, 2019, 6:11 PM IST

మహబూబ్​నగర్​లో మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ పర్యటన

పల్లెల్లో 150 రకాల అభివృద్ధి పనులను సర్పంచ్​లు దిగ్విజయంగా నిర్వహించవచ్చని ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్​గౌడ్​ అన్నారు. మహబూబ్​నగర్​ జిల్లా గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పంచాయతీలకు ట్రాక్టర్లు ఉండాలన్న ముఖ్యమంత్రి ఆలోచనల్ని ప్రజాప్రతినిధులు గుర్తుంచుకోవాలన్నారు.

ఇంటింటికి మరుగుదొడ్డి, ఇంకుడుగుంత తప్పనిసరని మంత్రి గుర్తు చేశారు. శ్మశాన వాటిక, డపింగ్ యార్డులకు భూములు సమకూర్చుకుని జనాలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details