తెలంగాణ

telangana

ETV Bharat / state

నీటిచౌర్యంతో పాలమూరు ఎడారే... - పోత్తిరెడ్డి ప్రాజెక్టు నుంచి నీటి మళ్లింపు

శ్రీశైలం నుంచి ఆంధ్రప్రదేశ్​కు నీటిని మళ్లించేలా ఇచ్చిన జీవో 203ను జగన్​ సర్కార్​ తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ భాజపా ఆధ్వర్యంలో నేతలు దీక్షలు చేపట్టారు. పోతిరెడ్డిపాడుకు కృష్ణా నీటిని తరలిస్తే ఉమ్మడి పాలమూరు జిల్లా ఎడారిగా మారనుందని భాజపా నేతలు వాపోయారు.

Srisailam for diverting water to Andhra Pradesh.
నీటిచౌర్యంతో పాలమూరు ఎడారే...

By

Published : May 14, 2020, 6:30 PM IST

భాజపా రాష్ట్ర కమిటీ పిలుపుతో మహబూబ్​నగర్​ జిల్లా నేతలు తమ ఇళ్లలో దీక్షలు చేపట్టారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారని, తెరాస ప్రభుత్వం ప్రజల ఆశయాలను నీరుగారుస్తోందని దుయ్యబట్టారు. నీటి అక్రమ తరలింపును భాజపా అడ్డుకుంటుందని తేల్చి చెప్పారు. ఆయా ప్రాంతాల్లో దీక్షల్లో భాజపా జిల్లాఅధ్యక్షురాలు పద్మజారెడ్డి, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, పడాకుల బాలరాజు, వీరబ్రహ్మచారి, పి.శ్రీనివాస్‌రెడ్డి, పాండురంగారెడ్డి, అచ్చుగట్ల అంజయ్య, పోతుల రాజేందర్‌రెడ్డి, రామాంజనేయులు, నరేందర్‌, సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details