తెలంగాణ

telangana

ETV Bharat / state

పారిశుద్ధ్యంపై జిల్లాపాలనాధికారి పర్యవేక్షణ - Supervision of the District Administrator on sanitation

మహబూబ్​నగర్​ పురపాలిక పరిధిలో డెంగీ కేసులు ఎక్కువగా నమోదు కావడంతో జిల్లా కలెక్టర్​ రోనాల్డ్​రోస్​ పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు.

పారిశుద్ధ్యంపై జిల్లాపాలనాధికారి పర్యవేక్షణ

By

Published : Sep 18, 2019, 5:21 PM IST

మహబూబ్‌నగర్‌ పురపాలిక పరిధిలో అత్యధికంగా డెంగీ కేసులు నమోదవడంతో పట్టణంలోని 41 వార్డుల్లో నలుగురు సిబ్బందితో ప్రతి ఇంటిని పరిశీలించే విధంగా ప్రణాళికలను రూపొందించి అమలు పరుస్తున్నారు. అందులో భాగంగా హౌసింగ్‌ బోర్డు కాలనీలో కలెక్టర్ రోనాల్డ్ రోస్ పర్యటించి పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. స్వయంగా ప్రతి ఇంటికి వెళ్లి నీటి నిల్వ ఉన్న ప్రాంతాలను గుర్తించి శుభ్రపరిచే విధంగా ఆదేశాలివ్వడంతో పాటు లార్వా ప్రబలకుండా పిచికారి చేయించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఏలాంటి రోగాలు తమ దరి చేరవని కాలనీవాసులకు సూచించారు.

పారిశుద్ధ్యంపై జిల్లాపాలనాధికారి పర్యవేక్షణ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details