తెలంగాణ

telangana

ETV Bharat / state

అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య - కోల్​బాయ్​ తండాలో కౌలు రైతు ఆత్మహత్య వార్తలు

వ్యవసాయ పొలంలో ఉరివేసుకుని ఓ కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబ్​నగర్​ జిల్లాలో చోటుచేసుకుంది.

Suicide by tenant farmer due to debt
అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య

By

Published : Dec 16, 2019, 2:44 PM IST

మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్ల మండలం కోల్​బాయ్ తండాలో కౌలు రైతు రాంచందర్​ నాయక్​ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దాదాపు 20 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని.. అందులో 9 ఎకరాల మేర పంట వేశాడు. దిగుబడి సరిగ్గా రాకపోవడంతో అప్పులు పెరిగి, మనస్థాపానికి గురైన రాంచందర్​.. గత రాత్రి పొలంలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాగేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య

ఇవీచూడండి: మంచి, చెడు స్పర్శలపై మీ పిల్లలకు చెప్పారా

ABOUT THE AUTHOR

...view details