కరోనా నేపథ్యంలో విశ్వవిద్యాలయాలు, కళాశాలలు మూసివేయడాన్ని నిరసిస్తూ పలుచోట్ల విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు విశ్వవిద్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. హైదరాబాద్- రాయచూరు అంతర్రాష్ట్ర ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. వసతి గృహాలతో కూడిన కళాశాలలను, విశ్వవిద్యాలయాలను తెరవాలని డిమాండ్ చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చి చదువుకుంటున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పాలమూరు విశ్వవిద్యాలయం ఎదుట విద్యార్థుల ధర్నా - palamuru university latest news
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు విశ్వవిద్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. హైదరాబాద్- రాయచూరు అంతర్రాష్ట్ర ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. వసతి గృహాలతో కూడిన కళాశాలలను, విశ్వవిద్యాలయాలను తెరవాలని డిమాండ్ చేశారు.
పాలమూరు విశ్వవిద్యాలయం ఎదుట విద్యార్థుల ధర్నా
కరోనా కారణంగా గత కొన్ని నెలలుగా కళాశాలలు, విశ్వవిద్యాలయాలు మూసివేయటంతో తాము ఇప్పటికే ఒక సెమిస్టర్ కోల్పోయామని, ఇప్పుడు ఉన్నఫలంగా మరోసారి విద్యాసంస్థలను మూసివేస్తే చదువులో వెనకబడిపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కరోనా సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ.. కళాశాలలను తెరవాలంటూ డిమాండ్ చేశారు. పోలీసులు విద్యార్థులను సముదాయించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.