తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రస్థాయిలో సత్తాచాటిన జడ్చర్ల విద్యార్థిని - తెలంగాణ ఇంటర్​ ప్రథమ సంవత్సర ఫలితాల్లో మెరిసిన హరిచందన

ఇంటర్మీడియట్​ ప్రథమ సంవత్సర ఫలితాల్లో మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్లకు చెందిన విద్యార్థిని హరిచందన 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిర్చారు. ఇదే పట్టుదలతో సివిల్స్​ సాధిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

student-harichandana-merit-marks-in-inter-first-year-examination-results
రాష్ట్రస్థాయిలో సత్తాచాటిన జడ్చర్ల విద్యార్థిని

By

Published : Jun 19, 2020, 6:42 AM IST

ఇంటర్‌ ప్రథమ సంవత్సర ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో పాలమూరు జిల్లా విద్యార్థిని ప్రతిభ కనబరిచింది. జడ్చర్లకు చెందిన హరిచందన అనే విద్యార్థిని ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించింది. ఆమె హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్​ విద్యాసంస్థలో విద్యనభ్యసించినట్లు వెల్లడించింది. ఇదే పట్టుదలతో సివిల్స్​ సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఆమె తల్లిదండ్రులు రాజేశ్వర్​ రెడ్డి, లక్ష్మి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. కుమార్తెకు రాష్ట్రస్థాయిలో ర్యాంక్​ రావటం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details