తెలంగాణ

telangana

ETV Bharat / state

వ్యాక్సిన్​ పంపిణీ విజయవంతానికి కృషి చేయండి : వెంకట్రావు - మహబూబ్‌నగర్‌ జిల్లా వార్తలు

అన్ని ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతో కరోనా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్ ఎస్‌.వెంకట్రావు కోరారు. కలెక్టరేట్‌లోని రెవెన్యూ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

Strive for successful vaccine distribution mahaboobnagar dist collector Venkatrao
వ్యాక్సిన్​ పంపిణీ విజయవంతానికి కృషి చేయండి : వెంకట్రావు

By

Published : Dec 23, 2020, 11:02 PM IST

తొలివిడత కొవిడ్​ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్ ఎస్‌.వెంకట్రావు కోరారు. మొదటి విడతలో వ్యాక్సిన్ ఇచ్చేందుకు జిల్లా నుంచి 8,574 మంది ఫ్రంట్​లైన్ సిబ్బందిని ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేశామని తెలిపారు. వ్యాక్సినేషన్​పై ప్రజల్లో గురించి అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

జనవరి 17న పల్స్​ పోలియో కార్యక్రమం

జనవరిలో నిర్విహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్​ సూచించారు. అందుకు అవసరమైన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో అందరికీ అందుబాటులో ఉండే విధంగా పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పుట్టిన శిశువు నుంచి ఐదు సంవత్సరాలలోపు పిల్లల వరకు అందరికీ పోలియో చుక్కలు వేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఇదీ చూడండి:క్రీస్తు ఆశయాలు ప్రపంచానికే ఆదర్శం: ఉత్తమ్

ABOUT THE AUTHOR

...view details