నాలుగేళ్లుగా మిషన్ భగీరథలో పని చేస్తున్న తమను ఆకారణం తొలగించడంపై ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. మహబూబ్ నగర్ కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేశారు. ఉన్నపలంగా విధులకు హాజరుకానివ్వకండి అంటూ సంబంధిత ఈఈలకు ఆదేశాలు జారీ చేశారని వాపోయారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎవ్వరినీ ఉద్యోగాల నుంచి తొలగించవద్దని ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు కేసీఆర్ కలల ప్రాజెక్ట్ అయిన మిషన్ భగీరథలోనే ఉద్యోగులను తొలగించడంపై విస్మయం వ్యక్తం చేశారు.
మిషన్ భగీరథ ఒప్పంద ఉద్యోగుల ధర్నా - Mission Bhagiratha Contract employees Strike latest news
అకారణంగా విధుల నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ.. మహబూబ్‌నగర్ కలెక్టరేట్ ముందు మిషన్ భగీరథ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. నాలుగేళ్ల నుంచి తాము ఇంటింటా నీళ్లు అందించేందుకు రాత్రి, పగలు కష్టపడి పని చేస్తే కరోనా కష్టకాలంలో తమను విధుల నుంచి తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కలెక్టరేట్ ముందు మిషన్ భగీరథ ఉద్యోగుల ధర్నా
రాష్ట్ర వ్యాప్తంగా 662 మంది వర్క్ ఇన్‌స్పెక్టర్లు, 47 జూనియర్ అసిస్టెంట్లు గత నాలుగేళ్లుగా ఈ ప్రాజెక్ట్‌లో పని చేస్తున్నారని పేర్కొన్నారు. కొవిడ్-19 నేపథ్యంలో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా.. కారణం చెప్పకుండా విధులకు రావద్దని చెప్పడం వల్ల ఆగ్రహించారు. ముఖ్యమంత్రి స్పందించి తమను వెంటనే విధులకు తీసుకోవాలని డిమాండ్ చేశారు.