తెలంగాణ

telangana

ETV Bharat / state

'రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోంది' - మహబూబ్​ నగర్​ వార్తలు

రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు యెండల లక్ష్మీనారాయణ మండిపడ్డారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యంగా కేంద్రం పని చేస్తోందని స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సదస్సులో ఎమ్మెల్సీ రాంచందర్‌రావుతో కలిసి ఆయన పాల్గొన్నారు.

State government adopts anti-farmer policies
'రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోంది'

By

Published : Sep 20, 2020, 6:32 PM IST

రైతులకు సరైన గిట్టుబాటు ధర లభించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వ్యవసాయ బిల్లును ప్రవేశపెడితే.. ముఖ్యమంత్రి కేసీఆర్ లేనిపోని ఆరోపణలు చేస్తుండడం సమంజసం కాదని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు యెండల లక్ష్మీ నారాయణ ఆరోపించారు. రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం పోకడలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం అవినీతికి తెరలేపిందని.. ప్రజల సొమ్మును ఇష్టానుసారంగా ఖర్చు చేస్తోందని ఆయన విమర్శించారు. పేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం మోకాలు అడ్డుపెడుతోందంటూ దుయ్యబట్టారు.

కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తోందని.. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యంగా పని చేస్తోందని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చాక రైతుల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలను చేపట్టిందని.. దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే ఉద్దేశంతోనే కేంద్ర వ్యవసాయ బిల్లును తీసుకొచ్చిందని ఆయన వివరించారు.

'రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోంది'

ఇదీచూడండి.. ఆ బిల్లుల ఆమోదంపై రైతన్న ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details