దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా తెలంగాణ పాలన కొనసాగుతోందని.. అన్నిరంగాల్లో తనదైన శైలిలో రాష్ట్రం దూసుకుపోతోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన రాష్ట్రావతరణ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. తొలుత పట్టణంలోని అమలవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్లో జాతీయ జెండా ఎగురవేశారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అమలవుతున్న రైతుబంధు, రైతుబీమా, మిషన్ భగీరథ లాంటి ఎన్నో పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు.