హైదరాబాద్ నాంపల్లి ఆబ్కారి భవన్ కమిషనర్ కార్యాలయంలో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతో ఆ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమావేశమయ్యారు. ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌తో పాటు అదనపు కమిషనర్ అజేయ్‌కుమార్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, బెవరేజ్ కార్పోరేషన్ అధికారులు పాల్గొన్నారు. నెలన్నర రోజుల తర్వాత ఇవాళ మద్యం దుకాణాలు తెరవగా మందుబాబులు.. మద్యం కోసం బారులు తీరారు. దుకాణాలు, ఎక్సైజ్ డిపోలు, డిస్టలరీలలో ఉన్న మద్యం నిల్వలపై మంత్రి సమీక్షించారు.
మాస్క్ ధరించి వస్తేనే మందు అమ్మండి: శ్రీనివాస్‌గౌడ్
13:26 May 06
మాస్క్ ధరించి వస్తేనే మందు అమ్మండి: శ్రీనివాస్‌గౌడ్
తాజాగా మద్యంపై 16 శాతం పెరిగిన ధరలను అప్డేషన్ చేయడం, మద్యం దుకాణాలకు ఎప్పటి నుంచి కొత్త సరుకు సరఫరా చేసేందుకు అవకాశం ఉంటుంది తదితర అంశాలను మంత్రి.. అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెరిగిన 16 శాతం ధరల కారణంగా నెలకి రూ. 300 నుంచి 320 కోట్లు ప్రభుత్వానికి అదనపు ఆదాయం చేకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మద్యం దుకాణాల వద్ద కొనుగోలుదారులు బారులు తీరి నిలబడినప్పటికీ.. భౌతిక దూరం పాటించేలా చూడాలని మాస్కులు లేని వారికి మద్యం విక్రయించరాదని ప్రభుత్వం నిర్దేశించిన నియమాలను కచ్చితంగా అమలు చేయాలని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: తెరుచుకున్న మద్యం దుకాణాలు.. ఆనందంలో మందుబాబులు