తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: శ్రీనివాస్​గౌడ్​

కరోనా నేపథ్యంలో రైతులు ఒకేచోట గుమిగూడకుండా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్​గౌడ్​ అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా నిర్వహించిన జిల్లా పరిషత్​ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

Special measures should be taken for farmers: Srinivas Gowd
రైతుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: శ్రీనివాస్​గౌడ్​

By

Published : Sep 1, 2020, 9:28 AM IST

కరోనా నేపథ్యంలో రైతులు ఒకేచోట గుమిగూడకుండా చూడాలని, ఎరువులు అందరికీ అందేలా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ తన ఛాంబర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సర్వ సభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురవడం వల్ల చెరువులు నిండి సాగు పెరిగిందని మంత్రి పేర్కొన్నారు. జిల్లాలో ఆయా మండలాలకు చెందిన జడ్పీటీసీలు, ఎంపీపీలు గ్రామాల్లో జరిగే ప్రతి కార్యక్రమంలో పాల్గొనాలని.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు అధికారులతో చర్చించి.. సమన్వయంతో గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని సూచించారు.

కార్యక్రమంలో కలెక్టర్‌ వెంకట్రావు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఆన్​లైన్​ ద్వారా సర్వసభ్య సమావేశం

ఇదీచూడండి.. దేశ కీర్తిని ప్రపంచానికి చాటింది: బండారు దత్తాత్రేయ

ABOUT THE AUTHOR

...view details