తెలంగాణ

telangana

ETV Bharat / state

కుమారుడు బ్రెయిన్​డెడ్.. అవయవ దానానికి ముందుకొచ్చిన తల్లిదండ్రులు - అవయవ దానానికి ముందుకొచ్చిన యువకుడి తల్లిదండ్రులు

కుమారుడు రోడ్డు ప్రమాదంలో గాయపడి.. బ్రెయిన్​డెడ్ అయ్యాడు. ఈ స్థితిలో తమ కుమారుడి అవయవాలను దానం చేసేందుకు ముందుకొచ్చారు బాధితుడి తల్లిదండ్రులు. తమ కొడుకు వల్ల వేరే ప్రాణాలు నిలుస్తే చాలన్నారు ఆ తల్లిదండ్రులు.

కుమారుడు బ్రెయిన్​డెడ్.. అవయవ దానానికి ముందుకొచ్చిన తల్లిదండ్రులు
కుమారుడు బ్రెయిన్​డెడ్.. అవయవ దానానికి ముందుకొచ్చిన తల్లిదండ్రులు

By

Published : Sep 21, 2020, 4:53 AM IST

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన ఓ యువకుడి అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. తమ కుమారుడు ప్రమాదానికి గురైనా... కొంతమందికైనా.. ప్రాణం పోసే ఆకాంక్షతో అవయవ దానానికి ఒప్పుకున్నట్లు తెలిపారు మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం సింగమ్మ గుడ తండాకు చెందిన లక్ష్మణ్ దంపతులు.

శుక్రవారం 44వ నెంబర్ జాతీయ రహదారిపై బాలానగర్ సమీపంలో రోడ్డు ప్రమాదంలో లక్ష్మణ్ నాయక్ రెండో కుమారుడు కుమార్ నాయక్ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి బ్రెయిన్​డెడ్​కు గురయ్యాడు. అతడి అవయవాలను దానం చేసేందుకు తల్లిదండ్రులు ముందుకొచ్చారు. మానసిక వేదన అనుభవిస్తున్నా.. ఇతరులకు సాయం చేసేందుకు ముందుకు రావడం పట్ల పలువురు అభినందించారు.

ఇదీ చూడండి: 'తెరాస ఎంత ఖర్చు పెట్టినా... ఈసారి గెలుపు కాంగ్రెస్‌దే'

ABOUT THE AUTHOR

...view details